![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1106 లో.. ఐశ్వర్య గదిలోకి లక్కీ వెళ్లి మాట్లాడుతాడు. నాకు తెలుసు ఐషు.. నేను అంటే నీకు ఇష్టమని సర్ ప్రైజ్ ప్లాన్ చేసావ్ కదా అని లక్కీ అంటుంటే వీడికి ఏమైంది ఇలా మెలికలు తిరుగుతున్నాడని ఐశ్వర్య అనుకుంటుంది.వీడికి ఏమైంది శశిని ఇష్టపడుతున్నానని తెలిసి వీడి మైండ్ పోయినట్లుందని ఐశ్వర్య అనుకుంటుంది.
మరొకవైపు నందు ఏడుస్తుంటే ఇందు వస్తుంది. ఏమైందని అడుగుతుంది. నాతో వెంకీ మాట్లాడడం లేదు అక్క.. దూరం పెడుతున్నాడు.. వాడు అంటే నాకు చాలా ఇష్టం అక్క.. వాడు లేకుండా ఉండలేనని నందు అంటుంటే నువ్వేనా ఇలా మాట్లాడేది ఎంత ధైర్యంగా ఉండేదానివి ఇలా అవుతున్నావ్ ఏంటి.. తను ఆలా మాట్లాడడానికి కారణం ఉండొచ్చు.. నువ్వు ఏం టెన్షన్ పడకు అని ఇందు ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత లక్కీ రెడీ అయి ఐషు దగ్గరికి వస్తాడు. ఏంటి ఐషు ఇంకా రెడీ అవ్వలేదా పెళ్లి చూపులకి లేట్ అవుతుందని లక్కీ అనగానే పెళ్లిచూపులు ఎవరికి అని ఐషు అడుగుతుంది. నీకు నాకు అని లక్కీ అనగానే తన చెంపచెల్లుమనిపిస్తుంది . నీకు నాకు పెళ్లిచూపులు ఏంట్రా అని కోప్పడుతుంది. అదంతా రాజు, ఇందు చూస్తారు. ఏంటి మావ పెళ్లిచూపులు ఏంటని కొడుతుందని లక్కీ అనగానే పెళ్లిచూపులు తనతో అని నీకు చెప్పానా అని రాజు అంటాడు. అంటే ఏంటి మావ ఐషు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా అని లక్కీ అంటాడు.
తెలుసు కానీ నేను చెప్పినట్లు చెయ్ అని రాజు అంటాడు. సరే అని లక్కీ అంటాడు.లక్కీని చూసుకోవడానికి రాజు డ్రామా కంపెనీ నుంచి ఆర్టిస్ట్ లని యాక్టింగ్ చెయ్యడానికి పిలుస్తాడు. యాక్టింగ్ బాగా చెయ్యండి అని వాళ్లకి చెప్తాడు. వాళ్ళు లోపలికి రాగానే రాజు అందరిని హాల్లోకి పిలుస్తాడు. లక్కీ గాడికి పెళ్లిచూపులు అని చెప్తాడు. పెళ్లిలో కాళ్ళు కడిగి కన్యదానం చేస్తారు కదా అప్పుడు తల్లిదండ్రల స్థానంలో ఎవరు కూర్చుంటారని అమ్మాయి తల్లి అడుగుతుంది. అదేం సమస్య కాదు.. మా రేఖ పిన్ని కూర్చుంటుంది. తనే కదా తల్లి అని రాజు అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |